జూన్ 2010న ప్రారంభించిన నా తెలుగిల్లు. వర్డ్‌ప్రెస్. కాం బ్లాగుకు ఇప్పటికి బాలారిష్టాలు తీరినట్లనిపిస్తోంది. బ్లాగు ప్రారంభం తప్ప మరే విషయమూ తెలియని నేను కుంచెం కుంచెం నేర్చుకుంటూ ఇప్పుడు నా మానసిక విన్యాసాలకు ఎప్పటికప్పుడు అక్షరరూపమిచ్చి పోస్ట్ చేయగలుగుతున్నాను. రోజూ ఒకరిద్దరయినా నా విన్యాసాలు చూసి స్పందించటం నన్ను ఉత్సాహపరుత్సోంది. ముఖ్యంగా మిత్రుడు జయదేవ్ గారు రోజూ తన భావాలను పంచుకోవటాన్ని స్వాగతిస్తూ, వినమ్రంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నాను. మా (ఈదుమూడి) ఊరి ఫొటోను బ్లాగులో పెట్టగానే స్పందించి, బాగుందని అభినందిస్తూ, దానిని తెవికీలో పెట్టేందుకు రవిచంద్ర ఎనగంటిగారు అనుమతి కోరినా, జవాబిచ్చే దారి తెలియక బాధగానే మౌనం వహించాను. రవిచంద్రగారూ – మా గ్రామ చిత్రపటం, చాన్నాళ్లుగా తెవికీలో ఉంది. మీరు స్పందించినందుకు మాగ్రామస్తులందరి ధన్యవాదాలు అందుకోండి. మీకు సమాధానం చెప్పలేకపోవటాన్ని అర్ధం చేసుకుని నన్ను మన్నిస్తారుకదూ? ఇక మీదట వెంటనే స్పందిస్తానని మిత్రులందరికీ మాటిస్తున్నాను. తర్వాత ప్రస్తావించవలసిన వారు కొత్తపాళి. బలిపీఠం కథకు సంబంధించిన పోస్ట్‌కు ఆయన స్పందించి రవిగాంచనిచో కవిగాంచునంటూ దీవించినందుకూ, నా పోస్ట్‌లో నెలకొన్న సాంకేతిక లోపాలను ఎత్తిచూపినందుకూ ధన్యవాదాలు. నా బ్లాగు చక్కగా ఉందని అభినందించిన కేవీఎస్‌వీగారికి ధన్యవాదాలు. కొడిహళ్లి మురళీమోహన్‌గారు ఈ-మెయిల్ చేయమని కోరారు. ఆయన ఏమి కోరారో, ఎలా చేయాలో నాకు ఇప్పటికీ తెలియనందుకు క్షమించగలరు. మా మిత్రబృందం పెట్టబోయే రాజకీయ తెలుగు వార పత్రికకు పేరు సూచించమని కోరగా, స్పందించిన మిత్రులను ఎన్నడూ మరవబోము. అందులోనూ సీనియర్ జర్నలిస్టు భండారు శ్రీనివాసరావుగారు స్పందించినందుకు మరీ మరీ కృతజ్ఞతలు. వారి సూచించిన పేరును ఉపయోగించు కుంటామో లేదోగానీ, రష్యాలో జర్నలిస్టుగా పనిచేసిన భండారుగారిని ఆయన అనుమతిస్తే మా పత్రిక కాలమిస్టుగా ఆహ్వానించాలని అనుకుంటున్నాము. కూడలికి దయకలిగేనా అని ప్రార్థించగానే రంజనిగారు ప్రత్యక్షమవటం సంతోషదాయకం. సరే ఈ చరిత్రను అవతలబెట్టి భవిష్యత్తును పరకాయించి చూస్తే ఇంకా పరిష్కారం కావలసిన సాంకేతిక సమస్యలు కొన్ని ఉన్నాయి. ఎవరయినా చేయూత ఇస్తే సంతోషిస్తాను.
1. నా బ్లాగుకు సొంత మాస్ట్‌హెడ్ (టెంప్లీట్ అనుకుంటాను) చేర్చాలి. ఎలా?
2. పోస్ట్ పాంట్ రూపం చిన్నదిగా ఉంది. దాన్ని రెట్టింపు చేయాలంటే దారేమిటి?
3. ఉప శీర్సికలవారీగా పేజీలు ఏర్పాటు చేసుకున్నాను. అయితే ఆయా శీర్షికల్ని ఆ పేజీల్లోనే పోస్ట్ చేయలేకపోతున్నాను. ఈ సమస్యను అధిగమించవచ్చా?
4. పోస్ట్ వర్గాల్ని ఎలా ఏర్పాటు చేయాలి?
5. వ్యాఖ్యలు నేరుగా పోస్ట్ కింద పడేందుకు ఏమి చేయాలి. (ఇప్పుడు నా అనుమతి కోసం వేచి చూస్తున్నాయి మరి. దానికి కొంత ధైర్యం కావాలని తెలుసు.)
ఈ సమస్యల్ని గనుక అధిగమిస్తే అంతోఇంతో బాగా రాయగలడన్న పేరున్న జర్నలిస్టుగా నేను తెలుగు బ్లాగర్ల లోకానికి శక్తివంతంగా సేవలు అందించగలనని నమ్ముతున్నాను. మిత్రులు ప్రత్యేకించి ఈ- తెలుగు మిత్రులు చేయూత అందిస్తారని ఆశిస్తున్నాను. చేయూత అంటే దూరంగా ఉండి చెప్పటం కాదు. చేయి పట్టి (చక్రవర్తిగారూ, అంత మంతమతిని మరి) బ్లాగాడించాలని వినమ్రంగా కోరుతున్నాను.
మీ స్పందనల కోసం నిజ్జంగా ఎదెరెదురు చూస్తానూ…. మీ వెంకట సుబ్బారావు కావూరి.
25 జూలై
Posted by వీవెన్ on జూలై 25, 2010 at 2:04 సా.
మొదటి రెండు పాయింట్లకి, బహుశా మీరు వేరే అలంకారం (ధీము)ని ఉపయోగించాల్సి ఉంటుంది. వర్డుప్రెస్స్.కామ్ లోని అలంకారాలలో మనం ఖతి (ఫాంటు) పరిమాణాన్ని పెంచుకోలేము. ఎక్కువ ఖతి పరిమాణాన్ని ఉపయోగించే, అలంకారాన్ని ఎంచుకోవడమే దారి. మాస్టహెడ్ (హెడర్ ఇమేజి) ని కూడా కొన్ని అలంకారాలు మాత్రమే మార్చుకునే వీలుని కల్పిస్తాయి. అలా వీలుకల్పించే అలంకారాన్ని ఎన్నుకోండి. (డాషుబోర్టు)
మూడవది: పేజీలని ఏదైనా స్థిరమైన సమాచారం (మీ గురించి, సంప్రదింపు సమాచారం) ఇవ్వడానికి ఉపయోగించండి. ఇక మీరు రాయాలనుకున్నవన్నీ, టపా (పోస్టు)లుగా రాయండి. టపాలని వివిధ శీర్షికల్లో వర్గీకరించుకోవచ్చు, (మీ నాలుగవ పాయింటు.) వర్గాలని సృష్టించుకోవడం, టపాలని వర్గాల్లో చేర్చడం గురించి ఈ వీడియోని చూసి తెలుసుకోండి: http://wordpress.tv/2009/01/14/adding-categories-and-tags-to-your-posts/
ఐదవ పాయింటు: వ్యాఖ్యలు మీ అనుమతి లేకుండా నేరుగా ప్రచురించబడేలా, అమరికలు చేసుకోవచ్చు. ఈ పేజీలో చూడండి: http://en.support.wordpress.com/settings/discussion-settings/
Posted by jayadev on జూలై 25, 2010 at 4:12 సా.
కంపూటర్/బ్లాగింగ్లు పెద్ద బ్రంహవిద్యాలు కాదు,ఒక్క ౧౦ రోజుల్లో మీరు మాకంటే బాగా బ్లాగాడినచగలరు మాస్టారూ …అభ్యసంకూసువిద్య అన్నారు కదా.wish u all sucess in this venture sir…..
Posted by ranjani on జూలై 25, 2010 at 6:44 సా.
బ్లాగు సాంకేతిక అంశాలకి సంబంధించి మీకు నేను సహాయం చేయగలను.
మీరే స్వయంగా తెలుసుకోవాలంటే కొన్ని మార్గాలు:
http://wordpress.org/support/
http://groups.google.com/group/telugublog/
http://telugublogtutorial.blogspot.com/
http://superblogtutorials.blogspot.com/
http://mahigrafix.com/forum/
Posted by బాలారిష్టాలు తీరాయి … ఇక బ్లాగు బాగు చూడాలి | indiarrs.net Classifieds | Featured blogs from INDIA. on జూలై 25, 2010 at 11:20 సా.
[…] https://telugillu.wordpress.com/2010/07/25/%e0%b0%ac%e0%b0%be%e0%b0%b2%e0%b0%be%e0%b0%b0%e0%b0%bf%e0%… […]
Posted by రవి చంద్ర on జూలై 26, 2010 at 11:27 ఉద.
<font size=4>పాఠ్యం</font>
ఇలా రాస్తే ఇప్పుడున్న పరిమాణం కన్నా పాఠ్యం పెద్ద పరిమాణంలో కనిపిస్తుంది…
Posted by రవి చంద్ర on జూలై 26, 2010 at 11:28 ఉద.
దీన్ని టైపు చేసేటపుడు html view లో ఉండాలి.