ముఖ్యమంత్రీ చచ్చిపో! చావాలనుకోకపోతే పదవన్నా వదలి పారిపో!!


నల్లారి కిరణ్‌కుమార్‌ రెడ్డీ చచ్చిపో!
చచ్చిపోవాలని లేకపోతే కనీసం ముఖ్యమంత్రి పదవన్నా వదలి పారిపో!! ఎందుకూ నీ జన్మ? పుట్టావు, నాలాంటి వాళ్లను చంపుకుతింటానికేగా!
నేను, నాలాంటి మధ్యతరగతి జనం బితుకుబితుకుమంటూనో, కునారిల్లుతోనో బతకాలంటే కిరణ్‌కుమార్‌ రెడ్డి కనీసం ముఖ్యమంత్రి పదవినయినా వదిలి పారిపోకతప్పదు తప్పదు మరి.
ఏంట్రా! వీడిలా నోరు పట్టకుండా తిడుతున్నాడని ఇప్పుడే నన్ను అపార్థం చేసుకోకండి మిత్రులారా! నేను రాసినదంతా చదివి, కాసేపు ఆలోచించి ఆ తర్వాత అవసరమనుకుంటే మీ నోరారా తిరిగి తిట్టి కక్ష తీర్చుకోండి.
ఈ నోటి దూలంతా విద్యుదాఘాతం తట్టుకోలేక చేసిన పని. మిత్రులారా! పూర్తి వివరాల కోసం చదవండి!!
2012 మే 09 ా ఉదయం 12 గంటలు
నేను అద్దెకుండే ఇంటి బోరు మోటారు మరమ్మతు ఖర్చులో నా భాగంగా ఐదు వందలు పడిందని చావు కబురు చల్లగా అందించాడు యజమాని.
”అదేమిటండీ? మోటరు పాడయితే బాగుచేయించే పని మీదేకదా?” ప్రశ్నించాను.
”ఏందీ బాగుచేయించేదీ? ఇప్పుడే మా ఇంటి కరెంటు బిల్లు వచ్చింది. పోయిన నెలదాకా ఏడెనిమిది వందల రూపాయలుండేది. ఇప్పుడు మూడు వేల చిల్లర వచ్చింది. బూబి కుట్టుగూలి సాయిబు అత్తరుకు సరిపోయిందంటారు అట్లా ఉంది నా పని.” అంటూ చకచక నడుచుకుంటూ వెళ్లి పోయాడు.
ఉదయం ఒంటి గంట
విద్యుత్తు బిల్లు గుమస్తా వచ్చాడు.
స్టూలు అడిగి తీసుకుని మీటరు రీడింగు తీశాడు.
ఎంత ?” అడిగాను?
”194 యూనిట్లు” చెప్పాడు.
”అమ్మో, అంత కాలిందా? పోయిన నెల 59 యూనిట్లేగదా!” ఆశ్చర్యం, ఆంతోళనగా ప్రశ్నిరచాను.
”ఇంతలోనే ఏమయింది! బిల్లు ఇస్తాను చూడండి, మీ డుపు ఎట్లా కాలుతుందో?” అంటూ బిల్లు చేతిలో పెట్టి వెళ్లిపోయాడు.
”1237” చూస్తూనే, పైకి చదివేశాను.
”పోయిన నెల 135 రూపాయలు కట్టాను.” ఇప్పుడు ఎన్ని రెట్లు పెరిగిందీ! ఇలా అయితే నాలాంటి వాళ్లు బతికినట్లే??!!
కడుపు మంట ప్రారంభమయింది. కోపంతో శరీరం వణకటమూ మొదలయింది.
”ముఖ్యమంత్రి చావనన్నా చావలేదుగదా?” అంటూ మా పక్కవాటా ప్రభాకరరావుని కరెంటు బిల్లు ఎంత వచ్చిందని వాకబు చేశాను.
”ఇప్పుడే చూస్తున్నానండీ! 1455 రూపాయలు వచ్చింది.” అతని గొంతుకలోనూ కిచకిచలు విన్పిస్తున్నాయి.
అలానే నాలుగు మెట్లుదిగి కింద వాటాలో ఉండే రమణను వాకబు చేశాను.
”అమ్మో, ఈ నెల్లో ఎటూ పెరుగుతుంది గదా అని రూ. 750 తీసిపెట్టాను. 650 రూపాయల బిల్లు వచ్చింది. మూడు రెట్లు పెరిగింది. మోటారు మరమ్మతు 500 రూపాయలు కొత్తగా వచ్చిపడింది గదా! ఈ నెల్లో అప్పు చేయాల్సిందే సార్‌!” కళ్లమ్మట నీళ్లు తిరుగుతండగా ఉద్యోగ విధులకు బయలుదేరాడు. ఆయన ఇంట్లో పగలు ఎవ్వరూ ఉండరు. రాత్రికయినా కరెంటు వాడకంలో ఆయన కుటుంబ సభ్యులంతా వీలయినంత పొదుపు పాటిస్తారు. అయినా మూడు రెట్లు అధికంగా వచ్చిన బిల్లు కట్టటం కష్టమంటాడు. పొదుపెందుకు దండగ అంటూ మంచం మీద కూలబడ్డాడు.
వాళ్ల పక్కింటి వాళ్లూ పగలు అస్సలు ఉండరు. అయినా 680 రూపయల బిల్లు వచ్చి పడింది పాపం.
ఇంతంతేసి కరెంటు బిల్లుల్ని కట్టేదెలా! కడితే ఆనక బతికేదెలా!!
దేనికి కోత పెట్టుకోవాలి? మా ఇంట్లో అందరూ శాకాహారులమే. (కులం రీత్యా కాదులెండి)
మిత్రులారా ఇప్పుడు చెప్పండి. నేను తిట్టటంలో ఏమన్నా తప్పుందంటారా!
నా కడుపు మంటకు అర్ధం ఉందంటారా? లేదా??
చివరిగా కమ్యూనిస్టులకు ఒక్కమాట చెప్పాలని ఉంది.
మాకు కడుపు మండుతోంది!
రోడ్డెక్కుదాం రండి!!

5 వ్యాఖ్యలు

  1. Posted by Snkr on మే 9, 2012 at 2:18 సా.

    ముఖ్యమంత్రి చస్తే/పోతే మీ కరెంటుబిల్లు తగ్గుతుందనుకుంటే … నేను కూడా వెర్రి గొంతుకొక్కటి ధార పోస్తాను. ఇలా రోజు చచ్చేకన్నా కుందళం అణు ప్రాజెక్టులు మాకు కావాలని అడుగుదామా? అది లీకయ్యి పోతే ఒకనాడు పోతాం, బాగున్నన్ని రోజులు బాగుందాము. ఏమంటారు తెలుగిల్లు?

    స్పందించండి

  2. Posted by vara on మే 9, 2012 at 3:14 సా.

    MEE AREA LO meter tampering jaruguthunatlundhi………..only amount okkate kaadu gaa…number of units koodaa 3 times ayyinatlundhi……..I am not sure anyway

    స్పందించండి

  3. Posted by Weep Hater on మే 10, 2012 at 12:36 ఉద.

    తప్పులు మీరు చేసి ముఖ్యమంత్రిని చచ్చిపొమ్మంటారేంటి?

    కొత్త విద్తుత్తు ఫాక్టరీలు కడితే ఒద్దొద్దంటూ ఏడుస్తారు. విద్యుత్తు రేట్లు పెంచితే హమ్మో హమ్మో అంటూ ఏడ్చిపోతారు. ఇప్పుడేమో బిల్లు పెరిగిందంటూ ఏడుస్తున్నారు.

    మీ కలానికి రెండు వైపులా ఏడుపే సుమండీ! మర్చిపోయాను, మీరు జర్నలిస్టులు కదా. పైగా కమ్యూనిస్టు కూడానూ! ఇక చెప్పాల్సిన పనిలేదు.

    స్పందించండి

  4. అసలు ఉచిత విద్యుత్ కోసం రాజశేఖరాసురుడిని నమ్మడమే మనవాళ్ళు చేసిన పెద్ద తప్పు కదా.

    స్పందించండి

  5. పోయిన నెల ఎన్ని యూనిత్లు కాలింది, ఈ నెల ఎన్ని యూనిట్లు కాలింది తేల్చకుండా ఆ ఏడుపేంటి మేష్టారూ? అంతే కాదు, రీడింగ్ తీసే అబ్బాయి మీటరు చూడకుండా నెంబర్లు వేసుకుంటే (ఒక్కోసారి ఇంట్లో ఎవరూ లేకపోతే అదె పని చేస్తాడా సన్నాసి), అపుడు మిగిలిపోయిన యూనిట్లు ఇపుడు కలిసిపోతాయి మరి. అందుకే ఆ బడుధ్ధాయి రీడింగ్ సరిగా తీసాడో లేదో మనం చూసుకోవాలి.

    స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: