అమ్మ పలుకు – చరిత్రనూ, భవితనూ పట్టిచూపిన ‘తెలుగు వెలుగు’


రామోజీ విజ్ఞాన కేంద్రం నుంచి వెలువడిన ‘తెలుగు వెలుగు’ మాసపత్రిక తొలి పత్రికను తెలుగు భాషాదినోత్సవం సందర్భంగా ఆగస్టు 29న విడుదల చేయటం దాని లక్ష్యాన్ని పట్టిచూపుతోంది.
బ్రహ్మాండంగా ఉంటుందని ఊహించుకున్నందునేమోగానీ పత్రిక ఆశించినమేర ఆకట్టుకోలేక పోయింది. అయితే బాగుందనటంలో అతిశయోక్తి లేదు. ప్రత్యేకించి తెలుగు భాషాభివద్ధికి దిశానిర్ధేశం చేస్తుందన్న నమ్మకం కుదిరింది.
తెలుగు తొలి అక్షరం ‘అ’ చుట్టూతా వెలుగులు నింపి, రంగవల్లులు అద్ది ముఖచిత్రంగా ముద్రించటం ముదావహం.
తెలుగు వెలుగు కోసం … అంటూ రామోజీరావు సంతకంతో తొలి పేజీలో సాక్షాత్కరించిన సంపాదకీయంలో తాము చేయదలచుకున్నది చెబుతూనే తెలుగువాళ్లందరూ ఈ బృహత్‌ యజ్ఞంలో పాలుపంచుకోవాలని కోరటం ఆహ్వానించదగినది. అయితే ఈనాడు తొలిపేజీలో ఆయనే రాసిన సంపాదకీయంలో వచ్చిన కొన్ని విషయాలు దీన్లో లేకపోవటం లోటుగా భావించాలి. పిల్లల కోసం పత్రిక, పుస్తకాలు త్వరలో రానున్నాయని దాన్లో వివరించారు. వెబ్‌సైట్‌ కూడా త్వరలో మనముందుకు రానున్నదన్న విషయం సంతోషదాయకం.
తెలుగదేలయన్న అంటూ సినారే సమీక్షకు పెద్ద పీట వేయటం సరైనదే. తెలుగు భాషను కాపాడుకునేందుకు పాఠశాలల్లో అమ్మ భాషను నిర్బంధం చేయాలన్న ఆయన చేసిన సూచనను వెంటనే అమలయ్యేలా ప్రభుత్వంపై ఒత్తిడి చేయటం తెలుగువారందరు ముఖ్యమైన కార్యక్రమంగా స్వీకరించాలన్నది నా కోరిక. ”నాగరిక జాతి మాతృభాషలోనే మాట్లాడుతుంది” అన్న ఆంగ్ల కవి ఈట్స్‌ మాటల్ని సినారే గుర్తుచేయటం బాగుంది.
అమ్మ భాషల విషయంలో గాంధీజీ అభిప్రాయాలను బాపూ బోధను విని ఉంటే! శీర్షిక బోధపరిచింది.
రాచపాళెం ‘కాలానికి ముందుమాట గురజాడ బాట’ వ్యాసం అప్పారావు రచనలన్నింటినీ చదివించేందుకు పురికొల్పుతున్నది.
వ్యంగ్య చిత్ర సంపాదకుడు శ్రీధర్‌ రచన పరభాషా పరాయణత్వం … తెలుగు పదాల వేట కార్యక్రమాన్ని ముమ్మరం చేయాల్సిన ఆవశ్యకతను వివరించింది.
”తెలుగు నేర్చుకుంటే నాకు ఉద్యోగం వస్తుందన్న నమ్మకాన్ని కలిగించాలి” అంటూ ‘పోటీకి రాని తెలుగు’లో ద్వానా శాస్త్రి సశాస్త్రీయ విషయాలను బహుచక్కగా పొందుపరిచారు. పోటీ పరీక్షలలో తెలుగు వినియోగం ఎలా ఉండాలో అనుభవపూర్వక సూచనలు చేశారు.
వేటూరి ‘తెలుగువాడా కళ్లు తెరు” అంటూ చేసిన ఆదేశాన్ని మనమంతా వినాలి.
”అమ్మ భాష కాదుకానీ … (తనకు) అన్నం పెట్టిన భాష” తెలుగును తెగ మెచ్చుకున్నారు చలనచిత్ర నటుడు ప్రకాష్‌రాజ్‌.
ప్రధానోపాధ్యాయుడు కొమ్మోజు శ్రీధర్‌ రాసిన మన భాష పద్యాలను పాడించి అందరికీ విన్పించేవాళ్లు ఎవ్వరో ముందుకు రావాలి!
పెద్దాపురంలో తరచూ కన్పించే ఫ్రాన్సీయుడు నెజర్స్‌ సంగతులు చదివితేనన్నా మన జాతికి సిగ్గు వస్తుందేమో? చూడాలి. మన భాష దుస్థితిపై ఆయన విశ్లేషణ స్వీకరించాల్సిందే.
ఒక్క అక్షరంతోనే గొప్ప భావాలు పలికించే గొప్పదనం తెలుగులో ఉందంటూ అయ్యగారి శ్రీనివాసరావు గుర్తుచేశారు.
భాషా బోధకుల బాధల్ని రవిచంద్రకుమార్‌ చక్కగా పరిచారు.
రాజకీయ ఒత్తిడితో తెలుగు భాషను  రక్షించుకోవలసిన ఆవశ్యకతను మండలి బుద్ధప్రసాద్‌ వివరించారు.
గురువు చలువ శీర్షికతో ప్రచురించిన ఉపాధ్యాయ దినోత్సవ ప్రత్యేక వ్యాసంలో గురువు చిత్రాన్ని నల్లగా తీర్చిదిద్దిన వైనం నేటి పరిస్థితిని చెప్పకనే చెబుతోంది.
రవిశంకర్‌ తనదైన శైలిని కొంత పక్కనబెట్టి ప్రధానంగా ఈనాడు పద్ధతుల్లో అలంకరించిన 100 పత్రాల ఈ పత్రిక 20 రూపాయలకే అందించటం విశేషమే.
అన్నట్లు పత్రికతోపాటు అందించిన ‘వైకుంఠపాళి’ ఆట వరకూ అయితే పర్వాలేదుగానీ వివరణతో నేను విబేధిస్తున్నాను. ఎందుకంటే అసురులు ద్రావిడులు. అంటే భూమి పుత్రులు. అలాంటి సారాయి తాగని వారిని తుచ్చులుగా అభివర్ణించటం పుక్కిటి పురాణాలను వల్లెవేస్తూ ఉపాధి పొందే గరికపాటి నరసింహారావు లాంటివారికి తగునేమోగానీ, ద్రావిడం నుంచి పుట్టిన తెలుగును సశాస్త్రీయంగా పాఠకులకు అందించేందుకు ప్రారంభమయిన తెలుగువెలుగుకు అవసరం లేదేమో!
నిజమైన చరిత్ర తెలిసిన తెలుగువాళ్లెవ్వరూ అసురులను తప్పుపట్టటాన్ని ఆమోదిస్తారని అనుకోను. ముందు ముందు ఇలాంటి తప్పిదాలు చోటుచేసుకోకుండా తెలుగువెలుగు ప్రచురణకర్తలు జాగ్రత్తలు తీసుకుంటారని ఆశించటంలో తప్పులేదనుకుంటాను.

3 వ్యాఖ్యలు

  1. పుస్తకంలోని శీర్షికలూ, అంశాలపై క్లుప్తంగా బాగా వ్రాశారు.
    //నిజమైన చరిత్ర తెలిసిన తెలుగువాళ్లెవ్వరూ అసురులను తప్పుపట్టటాన్ని ఆమోదిస్తారని అనుకోను//
    అసురులను(నాకర్ధమయ్యే భాషలో రాక్షసులను) ద్రావిడులని అనుకుంటే మీరన్న సమస్య వస్తుందేమో..! కానీ తెలుగువాళ్ళని అనుకున్నంత మాత్రాన వారి రాక్షసత్వాన్నితప్పు పడితే ఎవరైనా ఎలా ఆమోదించకుండా ఉంటారో, లేక ఉండాలో నాకర్ధం కాలేదు.
    నా బ్లాగులో ఇదే విషయం (పరమ పద సోపాన పటం) మీద వ్రాసిన వ్యాసం చదివి అబిప్రాయం చెప్పగలరు.
    http://radhemadhavi.blogspot.in/2012/01/blog-post_21.html

    .

    స్పందించండి

  2. ప్రతి జీవికి భావ ప్రకటన ఉంటుంది. తమ మనోభావాలను సైగల ద్వారా ఇతరులకు తెలియజేయడం జరుగుతుంది. ఒక్కోక్కసారి శబ్దోఛ్చారణ ద్వారా తెలుపుతాడు. ఆటవిక యుగం నుండి నేటి వరకు నాగరికత, సామాజిక మార్పులు, చేర్పులు భాషోద్యమమును బట్టి మనం మాట్లాడుకునే ప్రాంతీయ, రాష్ట్రీయ అంతరాష్ట్రీయ విదేశీ భాషలలో ఎన్నో మార్పులు వచ్చినా, మాతృభాషకే ప్రాధాన్యత ఇస్తారు. అయితే ఒక్కొక్క రాష్ట్రం తమ భక్తి భావాలతో తమ భాషను విస్తృతంగా గౌరవిస్తూ సాధ్యమైనంతవరకు కార్యాలయాలలోను ప్రజా సంబంధితవ్యవహారాలలోను తమ భాషను బహుళ ప్రజాభిమానంగా భావిస్తూ అధికారికంగా, వ్యాపారపరంగా తమ దైనశైలిలో ప్రాచుర్యం కల్పిస్తుంటారు. ఇతర రాష్ట్రాలు ఏమి అనుకున్నా పరువాలేదు, మాకేంటి అనుకొని తమ మాతృభాష తమ ప్రాంత భాష తమ రాష్ట్ర భాషను అనువాదాలు లేకుండానే భాషణ ద్వారా లేఖల ద్వారా తెలుపటం వారికి గల మాతృ భాషాభిమానంగా చెప్పొచ్చు. ఇక మన భాషకు ఒకప్పుడు యాబది అక్షరాలు, ఒత్తులు, కొమ్ములు, అచ్చులు, హల్లులు సమాసాలతో వాక్య శబ్దోఛ్ఛారణ మూల స్తంభమైన వ్యాకర్ణ ఛందస్సులుండేవి. నాటి పండితులు, మహా రచయితలు సంస్కృత భాషను ఆదరించినప్పటికీ తమదైన కమ్మని తెలుగు భాషను పోషించారు. ఇంకా చెప్పాలంటే సి.పి భ్రౌను, శ్రీకృష్ణ దేవరాయలకు తెలుగు ప్రజలు ఎంతో ఋణపడిఉన్నారు.

    స్పందించండి

  3. ఓం శ్రీ విష్వక్సేనయన:
    -నెగోశ్రీ
    -చరవాణి ౯౧౭౭౫౦౬౯౭౬
    (9177506976)
    నేటి పెళ్ళిళ్ళు
    వలల పెళ్ళిళ్ళు
    (నెట్ మారేజేస్)
    వలపులు లేని పెళ్ళిళ్ళు.
    తలపులు లేని పెళ్ళిళ్ళు.
    తలుపులు మూయు పెళ్ళిళ్ళు .
    కులాంతర, మతాంతర’
    కుతంత్రాల పెళ్ళిళ్ళు.
    చిలువలు పలువలు పెంచు పెళ్ళిళ్ళు .
    తెరచాప లేని జీవితాలు.
    పరాకులతోవిడాకులు పంచె ప్లీడర్లు.
    అర్థం కాని/లేని
    అర్ధ సంపాదనలు.
    వ్యర్ధపు డాంబికాలు (ఖర్చులు)
    నేటి తరం పెళ్ళిళ్ళు
    -౦-

    స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: