”రైతు వ్యతిరేకి మంత్రి వాలినేని వనవాసరెడ్డి” ”డౌన్‌డౌన్”
రైతుల ఉసురు తీస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ”పొణిజేటి పోశయ్య”
”డౌన్‌డౌన్”
”పచ్చని పొల్లాల్లో చిచ్చు పెడుతున్న జెన్-కో”
”డౌన్‌డౌన్”
”ఉపసంహరించుకోవాలి – ఉపసంహరించుకోవాలి”
”థర్మల్ పవర్ ప్లాంటు కోసం పచ్చని పొలాల సేకరణ కార్యక్రమాన్ని”
”మా ప్రాణాలు పోయినా”
”మా పొలాల్ని వదులుకోం”
వందలాది రైతు కుటుంబాలకు చెందిన ఆడ, మగ, పిల్లా, జెల్లా, ముసలి, ముతక చీరాల- ఒంగోలు రోడ్డుమీద చేరి నిరసనకు పూనుకోవటంతో అటూ ఇటూ వాహనాలు బారులుదీరి నిలిచిపోయాయి. బస్సు నాగులుప్పలపాడు చేరి ఆగిపోయింది. నినాదాల ప్రతిధ్వని వీరయ్య చెవికి సోకటంతో నిద్రమత్తు వదిలింది. అన్నం తిని బస్సెక్కటంతో నిద్రాదేవి వీరయ్యను వరించింది.
”ఏందంటరా? అది!” అర్ధంకాక సాంబయ్యను అడిగాడు.
”కనపర్తి రైతులు కక్కాయ్. పవర్ ప్లాంటు వద్దని రాస్తారోకో చేస్తున్నారు. అమ్మనబ్రోలు జయంతి బాబుండలా, అదే రైతు సంఘమని వస్తంటాడుగదా, వీళ్లందరినీ అతగాడే పోగేసినట్లున్నాడు.” అప్పటిదాకా గమనించినదంతా వివరించి చెప్పాడు సాంబయ్య. మధ్యాహ్నం 12 గంటలకు రైతుల్ని పోలీసులు అరెస్టు చేయటంతో వాహనాలు తిరిగి పరుగులు ప్రారంభించాయి.
29 సెప్టెంబరు 2010న తెలుగు పల్లెల జీవన ధారావాహిక – 4
28 సెప్టెం
Posted by kishna on సెప్టెంబర్ 28, 2010 at 7:44 సా.
నాగులుప్పలపాడు ముందు గుళ్ళకమ్మ చప్టా మీద నీళ్లు పారటం, బస్సులు ఆగిపోవటం తాకుతారనుకొన్నాను. మళ్లీ ఇనగొల్లు నుండి ఒంగోల్ ఎర్ర బాస్సు ఎక్కిన ఫీలింగ్ తీసుకొచ్చారు, ఆ బస్సు ఎక్కి అచ్చంగా ఓ పదైనుఏళ్లు అయ్యినా, ఆ జ్ఞాపకాలు ఇప్పటికీ పచ్చిగానే ఉన్నాయి.
మీకేంటిరా ఆంద్రోళ్లు కమ్మగా పంటలు పడుతాయి అంటూ కాస్త అసూయ గా మాట్లాడే ఇంకా తెలబాన్ కాని నా తెలంగణా మిత్రునకు, ఇనగొల్లు లో మందుకక్కించటంలో స్పెసలిస్ట్ డాక్టర్ (పేరు మరచేపోయా) ఆసుపత్రిలో ఓ వారం కూకోపెట్టాలని ఎప్పుడూ అనుకొంటూ ఉంటా!!
వీలయితే 1980 లలో బుల్లెట్ బళ్లూ, ఆ తర్వాత ఆ బుల్లెట్ బాబుల ఆత్మహత్యలు మందుతాగి కూడా టచ్ చేయండి.
Posted by తెలుగిల్లు on సెప్టెంబర్ 28, 2010 at 7:58 సా.
హ్రుదయాన్ని కదిలించే మీ స్పందనకు హ్రుదయపూర్వక నెనరులు. మీరన్నట్లే గుళ్లకమ్మ చప్టా సంగతి తేల్చకుండా మన బస్సుముందుకెళా వెళ్తుంది? బాగా గుర్తు చేశారు పత్తి… పురుగు మందులు, కల్తీలు, బులెట్లు, తెల్లపురుగు వీటిపై దేనికదే రాయదగిన విశేషాంశాలు.
Posted by కొత్తపాళీ on సెప్టెంబర్ 28, 2010 at 10:12 సా.
మాస్టారు, అద్భుతంగా రాస్తున్నారు. రాబోయే భాగాలకోసం ఎదురు చూస్తున్నా.