చదువుల సారం చదవండి

చదువుల సారం  శీర్షికతో ప్రచురించిన 8 పుస్తకాల అసలు ఖరీదు రూ. 680. అయితే వాటిని ప్రచురణకర్తలు రాయితీ ధరలో రూ. 500కే అందజేస్తున్నారు.
రాష్ట్ర విద్యాశాఖ ఆధ్వర్యంలోని డిపిఇపి ప్రచురించిన ‘చదువు విజ్ఞానం’ మాస పత్రిక శీర్షికలను అంశాలవారీగా పుస్తకాల రూపమిచ్చారు. చదువు విజ్ఞానం పత్రికకు ఇప్పటి తూర్పు రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గ శాసనమండలి సభ్యుడు విఠపు బాలసుబ్రమణ్యం సంపాదకుడిగా వ్యవహరించారు. ఆద్భుతంగా పాఠకుల ఆదరణ పొందిన ఈ పత్రికను ప్రభుత్వం కావాలనే నిలిపివేసిందని నా అభియోగం. ఇది చదివిన పాఠకులు పలువురు పాత విధానాలకూ, పాత భావాలకూ తిలోదకాలు పలికుతున్నారన్న బాధతోనే పాలకులు దీని గొంతు నులిమేసారంటే అతిశయోక్తి లేదు. ఈ పత్రిక కొనసాగి ఉంటే రాష్ట్రంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు కళకళలాడుతుండేవి. ఎన్ని సమస్యలున్నా మధ్యలోనే మానేసేవారు ూండేవారు కాదని నా నమ్మకం. అంట ఉపాధ్యాయులను అంతలా ఈ పత్రిక ప్రభావితం చేసింది. అందుకనే ప్రైవేటురంగ జపం చేసే ప్రభుత్వానికి ఇదంటే గిట్టలేదు. జరగాల్సిందేదో జరిగిపోయింది. ఇప్పుడు జరగాల్సింది విద్యాభిమానులంతా కూడాలి. బాల్యాన్ని బతికించేందుకు పూనుకోవాలి. తల్లి భాషను రక్షించుకునేందుకు అడుగులు కదపాలి. మన సంసృతికి నిలబెట్టుకోవాలి. మన సంప్రదాయాలలో ఉత్తమమైన వాటిని పాటిస్తూ, కొత్తవాటిని అలవరచుకునే విధానానికి తెర తీయాలి. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాలి. ఈ భావాలకు జవజీవాలనిచ్చే చదువుల సారం పుస్తకాల దొంతరను జనవిజ్ఞానవేదిక, మంచి పుస్తకం సంయుక్తంగా ప్రచురించారు.
ఇందులో
1. కథలు విందాం
2. ఆడుకుందాం
3. అనుభవాలు పంచుకుందాం -1
4. అనుభవాలు పంచుకుందాం – 2
5. పాడుకుందాం –
6. భాషా వ్యాసాలు – 1
7. భాషా వ్యాసాలు – 2
8. చదువుల వెలుగులు …  శీర్షికలతో పుస్తకాలున్నాయి.
ఆర్థిక భారం అనుకుంటే ఇందులో ఉపాధ్యేతర రంగాలకు చెందినవారు రెండు, ఐదు పుస్తకాలను మినహాయించవచ్చు. ఇంకా కావాలంటే కథలు విందాం పుస్తకాన్ని కూడా మినహాయించవచ్చు. పుస్తక ప్రియులు మాత్రం అన్నింటినీ ఇంటి గ్రంథాలయంలో ఉంచుకుని చదువుకోదగినవి. హైదరాబాదు, నక్లెస్‌రోడ్డులో ప్రస్తుతం జరుగుతోన్న, విజయవాడలలో జనవరి ఒకటోతేదీ నుంచి పదో తేదీ వరకూ జరిగే పుస్తక ప్రదర్శనలో ఈ పుస్తకాలను మంచి పుస్తకం, జనవిజ్ఞానవేదిక సంయుక్తంగా నిర్వహిస్తున్న దుకాణంలో రాయితీ ధరల్లో పొందవచ్చు. జనవిజ్ఞానవేదిక, మంచి పుస్తకం చిరునామాలలో దేనికయినా రూ. 500 + ఖర్చుల కోసం రూ. 25 డీడీ పంపి తెప్పించుకోవచ్చు.
జనవిజ్ఞానవేదిక చిరునామా :
జనవిజ్ఞానవేదిక ప్రచురణల విభాగం,
162, విజయలక్ష్మి నగర్‌, నెల్లూరు – 524004
ఫోన్‌ : 9440503061.
మంచి పుస్తకం చిరునామా :
మంచి పుస్తకం,
12-13-450, తార్నాక, సికింద్రాబాద్‌- 500017.
మరిన్ని వివరాల కోసం
9490175160 (సిఏ ప్రసాద్‌, జనవిజ్ఞాన వేదిక)
9490746614 (మంచి పుస్తకం) సెల్‌ఫోన్లలో సంప్రదించవచ్చు.
మంచి పుస్తకం వెబ్‌సైట్‌ చిరునామా ఇదీ ….. http://www.manchipustakam.in

వ్యాఖ్యానించండి