కేవీపీ ఔట్‌ !


వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆప్తమిత్రుడు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కెవిపి రామచంద్రరావుకు ఎట్టకేలకు ఎదురుదెబ్బ తగిలింది. వైఎస్‌ హయాంలో ‘అధికార కేంద్రం’గా ఆయన హావా సాగించారు. రాష్ట్ర ప్రభుత్వ ఏ ముఖ్య నిర్ణయమైనా ఆయన అనుమతితోనే జరిగేది. కాంట్రాక్టులు, బదిలీలు ఇలా అన్ని విషయాల్లోనూ ఆయన మాట వేదవాక్కుగా అమలయ్యేది. వైఎస్‌ మరణానంతరం ఏర్పడ్డ రోశయ్య ప్రభుత్వంలోనూ ఆయన హావా కొనసాగింది. సలహాదార్లను తప్పించాలని అధిష్టానం నిర్ణయించిన నేపథ్యంలో ఇక రాష్ట్రంలో కెవిపి జమానా ముగిసినట్లే.

అయితే గియితే కేవీపీ ఇక యువ వైఎస్ కు సలహాదారుగా రూపాంతరం చెందవచ్చు. అంటే జగన్మోహనరెడ్డి వ్యవహారం ముదురు పాకాన పడే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఆవేశపరుడికి అపర చాణక్యుడు జతపడితే నిప్పు ఉప్పు చందమే కదా.

3 వ్యాఖ్యలు

  1. at last he got kicked in the but
    hope he doesn’t come back in a different role..

    స్పందించండి

  2. KVP ని పీకెయ్యడం, సిరంజీవి కి ఫోన్ చెయ్యడం – definitely something is cooking in Jagan camp.

    స్పందించండి

  3. Posted by రాజాబాబు on నవంబర్ 28, 2010 at 6:10 సా.

    ఇప్పటికైనా కెవిపి ఒకడుగు ముందుకేసి జగన్ తో కలిసి తన స్నేహితుని రుణం తీర్చుకోవాలని అనేకమంది వైఎస్ అభిమానులు కోరుతున్నారు. జగన్ స్పీడ్ కు కెవిపి మంత్రాంగం తోడైతే రాష్ట్రంలో ఎదురే వుండదని వాఖ్యాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ కూడా ఒకడుగు ముందుకేసి కెవిపితో చేయి కలపడం అనివార్యం. రాజకీయాల్లో ఎత్తుకు పైఎత్తులు సహజం. అధిష్టానం వైఎస్ కుటుంబంలోనే చీలక తెచ్చేందుకు యత్నిస్తుండగా, వీరి కలయిక పై ఎత్తుగా వుంటుంది.

    స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: